Hot Posts

6/recent/ticker-posts


 జగ్గంపేట సీఐని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ముసిరెడ్డి నాగేశ్వర రావు.                      కాకినాడ జిల్లా జగ్గంపేట : జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి తిరుపతి రావును సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కాట్రావులపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గండేపల్లి, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లకు సబ్ ఇన్స్పెక్టర్ గా సమర్థవంతంగా పనిచేసి మళ్లీ సర్కిల్ ఇన్స్పెక్టర్  శాంతి భద్రతలను పరిరక్షిస్తూ లా అండ్ ఆర్డర్ ను కాపాడుతూ సర్కిల్ పరిధిలో సమర్థవంతంగా పనిచేయగల సత్తా ఉన్న పోలీస్ అధికారిగా తిరుపతిరావు మరింత పేరు తెచ్చుకోవాలని, అసాంఘిక కార్యక్రమాల పైన, జూదాల పైన, మాదకద్రవ్యాల పైన ఉక్కు పాదం మోపి ప్రజలలో మరింత పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సబ్ ఇన్స్పెక్టర్ టీ. రఘునాథరావు పాల్గొన్నారు.