Hot Posts

6/recent/ticker-posts

సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం

 గత ప్రభుత్వంలో సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం సంక్షేమాంధ్రప్రదేశ్ గా మార్చి సుపరిపాలన అందిస్తున్నాం

పురపాలక శాఖ మంత్రి పి నారాయణ

కాకినాడ జిల్లా జగ్గంపేట గత ప్రభుత్వం చేసిన అవకతవలతో రాష్ట్రం హతకుతలమైందని కాకినాడ జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర పురపాలక , పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి నారాయణ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు  కార్యక్రమంలో  జగ్గంపేట నియోజకవర్గం రావడం జరిగింది అన్నారు. అలాగే తొలి అడుగు కార్యక్రమం ప్రజల్లో విశ్లేష స్పందన కనపడుతుందన్నారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కి నిదర్శనం ఆనందోత్సవాలతో ప్రజలు కనబడుతున్నారన్నారుగత ప్రభుత్వం చేసిన, అవకతవకలతో ఆర్థిక శాఖ మొత్తం అతల కొత్తలం అయిందన్నారు ఆర్థిక శాఖ వ్యవస్థ మొత్తం అతలాకుతలం చేసి, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసి వెళ్ళిపోయింది అన్నారు.ఇప్పుడు ప్రజలు కట్టే టాక్స్లు అన్ని గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది అన్నారు.అయినప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఉన్న అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న ఒక్కొక్కటి తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వస్తున్నాము అన్నారు. ప్రజలకు మాట ఇచ్చాము, మాట తప్పకూడదని ప్రభుత్వం రాగానే 3000 రూపాయల పెన్షన్ను 4000 రూపాయలు చేయడం మొదటి నెలలోనే పతి పెన్షన్ దారుడు కి ₹7,000 ఇచ్చామువికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగిందికిడ్నీ పేషెంట్లకు పదివేల రూపాయలు పెన్షన్ చేశామన్నారు.బెడ్రీడ్ పేషెంట్లకు 15వేల రూపాయలు  చేశామన్నారు .అదేవిధంగా మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అన్నారుకుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పిన ప్రకారం 67 లక్షల మంది పిల్లలకు పదివేల కోట్ల రూపాయలు బ్యాంకులో జమ చేయడం జరిగిందన్నారుఅదేవిధంగా రేపు ఆగస్టు 15వ తేదీ నుండి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ జిల్లాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ , జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ , ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు,మారిశెట్టి భద్రం, పోతుల మోహన్ రావు, తదితరులు ఉన్నారు..