ఎద్దులను తరలిస్తున్న వ్యాన్ సీజ్ చేసిన గండేపల్లి పోలీస్ వారు
కాకినాడ జిల్లా, గండేపల్లి మండలం, జగ్గంపేట నుండి హనుమాన్ జంక్షన్ కు పశువులను ఎటువంటి నియమ నిబంధనలను పాటించకుండా, తరలిస్తూ ఉండగా గండేపల్లి గ్రామం వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద 7 ఎద్దులను మరియు రవాణా చేయుటకు ఉపయోగించిన వ్యాన్ ను సీజ్ చేసి గండేపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడమైనది. అని సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ తెలియజేశారు
